31 July, 2026 | 12:29 PM

ఫార్ములా ఈ-కార్‌ రేసు విచారణ వాయిదా

31-07-2026 11:56 AM

హైదరాబాద్: ఫార్ములా-ఈ (Formula E) కేసుకు సంబంధించి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) శుక్రవారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఫార్ములా-ఈ రేస్ కేసులో అధికారిక విచారణ నేపథ్యంలో శుక్రవారం తమ ముందు హాజరుకావాలని నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టు కేటీ రామారావు, మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, ఇతర ముగ్గురు నిందితులను ఆదేశించింది.

విచారణ ప్రారంభమయ్యే మొదటి రోజున చార్జ్‌షీట్‌లో పేర్కొన్న నిందితులందరూ స్వయంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. అవినీతి నిరోధక శాఖ (ACB) దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను 2026 మే 14న పరిగణనలోకి తీసుకున్న కోర్టు, నిందితులకు సమన్లు ​​జారీ చేసింది. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఏసీబీ కోర్టు విచారణ శుక్రవారం ముగిసింది. తదుపరి విచారణను కోర్టు ఆగస్టు 25కి వాయిదా వేసింది. కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డి రూ.లక్ష పూచీకత్తు సమర్పించారు. ఫార్మూలా ఈ-రేస్ కేసులో ఏ-2గా అర్వింద్ కుమార్, ఏ3గా బీఎల్ఎన్ రెడ్డి ఉన్నారు.