బల్దియా నేతలను అభినందించిన నితిన్ నబీన్
కరీంనగర్ క్రైం, జూన్ 30 (విజయక్రాంతి): హైదరాబాద్ లోని ఘటకేసర్ రాక్ కన్వెన్షన్లో మంగళవారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అత్యంత వైభవంగా జరిగింది. రాష్ట అధ్యక్షులు రాంచందర్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి హాజరైన బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నభీన్ కరీంనగర్ బల్దియా నేతలను అభినందించారు.
ఈ సమావేశ విరామం సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, జిల్లా అధ్యక్షులు కృష్ణా రెడ్డి లను బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నభీన్కు మర్యాద పూర్వకంగా పరిచయం చేశారు. జాతీయ అధ్యక్షులు నితిన్ నభీన్ కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావుకు శాలువాలు కప్పి ప్రత్యేకంగా అభినందించారు.
మరోవైపు బీజేపి జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ ను కూడా కరీంనగర్ నేతలు మర్యాద పూర్వకంగా కలిశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావుల సమష్టి కృషిని సునీల్ బన్సల్ అభినందించారు. అనంతరం తమను శాలువాతో సత్కరించిన జాతీయ అధ్యక్షులు నితిన్ నభీన్, జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ కు మేయర్, డిప్యూటీ మేయర్లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.






