రేషన్ డీలర్లతో ప్రత్యేక సమావేశం
21-07-2026 08:27 PM
బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో రేషన్ డీలర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు తహసిల్దార్ రామ్మోహన్రావు తెలిపారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ... ఈనెల 31 లోగా రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులు ఈ కేవైసీ గడువులోగా పూర్తి చేసుకునేలా రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు సూచించాలని తెలిపారు. డీలర్లు నిబంధనల ప్రకారం రేషన్ షాపులు తెరిచి ఉంచాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం అందిస్తున్న రేషన్ సరుకులు పేద ప్రజలకు సక్రమంగా అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు పాల్గొన్నారు.






