21 July, 2026 | 10:15 PM

Breaking News

గ్రామాల్లో వెంటనే దోమల మందు పిచికారీ చేయాలి

21-07-2026 08:30 PM

మంగపేట,(విజయక్రాంతి): వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో దోమల సంఖ్య పెరిగి, డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి సీజనల్ వ్యాధులు వ్యాపించే ప్రమాదం అధికంగా ఉందని, వెంటనే మండలంలోని అన్ని గ్రామాల్లో దోమల నివారణ మందు పిచికారి చేయాలని బీఆర్ఎస్ పార్టీ మంగపేట మండల మాజీ సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా, మంగపేట మండలంలోని  గ్రామాల్లో ఇప్పటికీ దోమల మందు పిచికారీ చేపట్టకపోవడం ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే పరిస్థితులు నెలకొన్నయన్నారు. ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అన్ని గ్రామాల్లో దోమల మందు పిచికారీ చేపట్టడంతో పాటు పారిశుద్ధ్య చర్యలను ముమ్మరం చేయాలని, ప్రజల ఆరోగ్యంతో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దన్నారు.