10 April, 2026 | 2:59 PM

Breaking News

అమెరికా, ఇరాన్ శాంతి చర్చలపై కమ్ముకున్న నీలినీడలు   •   తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •   కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కాటం సత్యం   •   గోదావరి పుష్కరాల ఘాట్లకు వెళ్లే రోడ్లను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి   •   రచ్చ పల్లిలో చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కనవేన స్వప్న శ్రీనివాస్   •   తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త   •   సిఎం సహాయ నిధి పేదలకు వరం   •   ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం— పాల్గొన్న మంత్రి పొంగులేటి   •   గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి...   •  

అంగన్వాడీ బలోపేతానికి ప్రత్యేక చర్యలు

10-04-2026 12:55 AM

అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్

ముషీరాబాద్, ఏప్రిల్ 9(విజయక్రాంతి): అంబర్పేట్ నియోజకవర్గంలో అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్  తెలిపారు.

మేరకు గురువారం అంబర్ పేటలోని గోల్నాక  ఎమ్మెల్యే క్యాం పు కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు సెల్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్  మాట్లా డుతూ  నియోజకవర్గంలోని 34 అంగన్వాడి కేంద్రాల్లో మౌలిక వసతుల మెరుగుదలతో పాటు పిల్లలకు మెరుగైన సేవలు అందించేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించా మని చెప్పారు.

అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడి కేంద్రాలకు శాశ్వత భవనా లు నిర్మించేందుకు కృషి జరుగుతోందని పేర్కొన్నారు. అంగన్వాడి కేంద్రాల్లో విద్యుత్, తాగునీరు, ఇతర మౌలిక వసతుల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఎమ్మెల్యే టీచర్లకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.