లోక్ అదాలత్ లతో సమన్యాయం
సుల్తానాబాద్ జడ్జి దుర్గం గణేశ్
సుల్తానాబాద్,(విజయక్రాంతి): లోక్ అదాలత్ లతో ఇరు వర్గాలకు సమ న్యాయం అందుతుందని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేశ్ అన్నారు. శనివారం మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక కోర్టు ఆవరణలో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి గణేష్ మాట్లాడుతూ లోక్ అదాలత్ లలో ఇరు పక్షాల అంగీకారంతో రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవచ్చని అన్నారు.
కక్షిదారులు వ్యయ ప్రయాసలకు గురికాకుండా ఇరు వర్గాలు రాజీ ద్వారా తమ కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. లోక్ అదాలత్ తీర్పులపై ఎలాంటి అప్పీలు ఉండదని తెలిపారు. అనంతరం సీనియర్ సిటిజన్లు రిటైర్డ్ ఉపాధ్యాయులు అల్లం భాగ్యలక్ష్మి- సత్యనారాయణ దంపతులతో పాటు రిటైర్ ఉపాధ్యాయులు సత్యనారాయణ, ఖాలిక్, నర్సయ్య లను జడ్జి దుర్గం గణేష్ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ లోక్ అదాలత్ లో పలు క్రిమినల్ కేసులు, కుటుంబ వివాదాలు, భూమి తగాదాలు, చెక్ బౌన్స్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు సంబంధించి కేసులు పరిష్కరించారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వోడ్నాల రవీందర్, ఏజీపీ దూడం ఆంజనేయులు, సెంకడ్ క్లాస్ మెజిస్ట్రేట్ నేరెళ్ల శంకరయ్య, లోక్ అదాలత్ సభ్యులు మాడూరి ఆంజనేయులు, చీకటి సంతోష్, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఆవుల శివకృష్ణ, న్యాయవాదులు, పడాల శ్రీరాములు, ఆకారపు సరోత్తం రెడ్డి, కోడం అజయ్, బోయిని భూమయ్య, జోగుల రమేష్ , రుద్రారపు నర్సయ్య, గుడ్ల వెంకటేష్, వేముల స్నేహ, మాడూరి పృథ్వీ, బొబ్బిలి శ్యామ్, మందల రమేష్, కోర్టు సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






