22 August, 2026 | 11:47 PM

సోలార్ పవర్ తో కోల్డ్ స్టోరేజ్ రూమ్స్

22-08-2026 10:38 PM

- మెగా నిర్మాణాలకి ప్రభుత్వం 35శాంతం రాయితీ. 

- వెల్లడించిన చేవెళ్ల ఉద్యాన అధికారి కీర్తి కృష్ణ.

చేవెళ్ళ,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం రైతుకు 35 శాంతం రాయితీతో సోలార్ పవర్తో కోల్డ్ స్టోరేజ్ రూమ్స్ నిర్మాన్నన్ని చేపట్టింది. ఉద్యాన శాఖ వారి ఆధ్వర్యంలో శనివారం చేవెళ్ల డివిజన్ రైతులకి కోల్డ్ స్టోరేజ్ రూమ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చిట్టంపల్లి గ్రామంలో ఎకో ఫ్రొస్ట్ వారు నిర్మించిన సోలార్ పవర్ తో నడిచే కోల్డ్ రూమ్ ని రైతులు సందర్శించటం జరిగింది. చేతికి వచ్చిన పంట మార్కెట్ లో ధర లేనప్పుడు కోల్డ్ రూమ్స్ లో  రెండు నుండి మూడు వారాలపాటు ఉంచవచ్చాన్నారు.

ధర పెరిగాక మళ్ళీ మార్కెట్ కి పంపే అవకాశం ఉంటుంది. క్షేత్ర స్థాయిలో 2, 5, 10 టన్నుల కెపాసిటీ గల కోల్డ్ స్టోరేజ్ రూమ్స్ లేదా కమర్షియల్ గా పెద్ద కెపాసిటీగల కోల్డ్ స్టోరేజ్ నిర్మాణాలు కూడా ఎకో ఫ్రొస్ట్ వారు నిర్మించి ఇస్తున్నరన్నారు. కమర్షియల్ పెద్ద కోల్డ్ స్టోరేజ్ నిర్మాణాలకి ప్రభుత్వం 35 శాంతం రాయితీ కూడా అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమం లో చేవెళ్ల ఉద్యాన అధికారి కీర్తి కృష్ణ, ఉద్యాన విస్తరణ అధికారి నర్సింలు ఎకో ఫ్రొస్ట్ రీజినల్ మేనేజర్ చాంద్ పాషా, సేవా స్ఫూర్తి ఫౌండేషన్ NGO మేనేజర్ రత్నాకర్ రైతులు మాణిక్యం అమృత రాజు శివ సృజయ్ శ్యామల బుచ్చయ్య పాల్గొన్నారు.