22 August, 2026 | 10:34 PM

Breaking News

శ్రీ నేతాజీ హైస్కూల్‌లో ఘనంగా మాక్ అసెంబ్లీ

22-08-2026 09:26 PM

ప్రజాస్వామ్య విలువలు, నాయకత్వ లక్షణాలపై విద్యార్థులకు అవగాహన

గణపురం,(విజయక్రాంతి): గణపురం మండలంలోని బస్వరాజుపల్లి శ్రీ నేతాజీ హైస్కూల్‌లో విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు, నాయకత్వ లక్షణాలు, సామాజిక సమస్యలపై అవగాహన పెంపొందించే ఉద్దేశంతో మాక్ అసెంబ్లీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు శాసనసభ్యులు, మంత్రులు, స్పీకర్ తదితర పాత్రలను పోషిస్తూ ప్రజా సమస్యలు, ప్రభుత్వ పథకాలు, విద్యార్థులకు సంబంధించిన అంశాలపై చర్చించారు.

ప్రశ్నోత్తరాల కార్యక్రమం ద్వారా సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లి, వాటిపై సమాధానాలు పొందే విధానాన్ని విద్యార్థులు ప్రదర్శించారు.మాక్ అసెంబ్లీ ద్వారా విద్యార్థుల్లో ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహనతో పాటు మాట్లాడే నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు, సమస్యలను విశ్లేషించే సామర్థ్యం పెంపొందుతాయని పాఠశాల కరస్పాండెంట్ ఉడుత సాంబయ్య యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు.