14 March, 2026 | 4:19 AM

గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు

14-03-2026 01:38 AM

ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి 

నిర్మల్, మార్చి 13 (విజయక్రాంతి): గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులను మంజూరు చేస్తున్నట్టు నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవా రం దిల్వార్పూర్ మండలం లోలం, నిర్మల్ రూలర్ మండలంలోని చిట్యాల మ్యూజిక్ అక్కాపూర్ గ్రామాల్లో రెండు కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహించారు.

గ్రామా ల్లో ఐకెపి సంఘ భవనాలతో పాటు పాఠశాల ప్రహరీ గోడలు సిసి రోడ్లు అంతర్గత రోడ్లు వెంటనే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిపిఓ శ్రీనివాస్ సర్పంచులు సుప్రి య వెంకటరెడ్డి రాజేశ్వర్ శ్రీనివాస్ ఇతరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వెంకట రెడ్డి,ఉప సర్పంచ్ రమేష్, నాయకులు రావుల రాంనాథ్, జమాల్, మాజీ సర్పంచ్‌లు ప్రసాద్‌రెడ్డి, గంగారెడ్డి, అనిల్, నాయకులు  సంతోష్, రాజు రెడ్డి, సాగర్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.