18 July, 2026 | 12:44 AM

గిరిజనప్రాంతాల అభివృద్ధికి కేంద్ర నిధుల కోసం ప్రత్యేక కృషి

18-07-2026 12:34 AM

ఎంపీ పోరిక బలరాం నాయక్ ముమ్మర సమీక్ష

మహబూబాబాద్, జులై 17 (విజయక్రాంతి): మహబూబాబాద్ పార్లమెంటు స్థా నం పరిధిలో గిరిజన ప్రాంతాలు, పట్టణాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల కోసం ప్రత్యేకంగా కృషి చేస్తానని మహబూబాబాద్ ఎంపీ పోరిక బ లరాం నాయక్ తెలిపారు. కేంద్రం ద్వారా వి విధ పథకాలకు రావాల్సిన నిధుల కోసం ట్రై బల్ వెల్ఫేర్, పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ కార్యాలయాల్లో అధికారులతో ఎంపీ సమీక్ష నిర్వ హించారు. కేంద్ర నిధుల సాధన, కొత్త ప్రతిపాదనలు, పెండింగ్ నిధులు, పనులపై ప్ర త్యేక దృష్టి కేంద్రీకరించాలని, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధియే లక్ష్యంగా కృషి చేయాలని అధి కారులను కోరారు.

ఎంపీ బలరాం నాయక్  ఈ మేరకు ఆయా శాఖల ఉన్నతాధికారుల తో హైదరాబాద్లో వరుస సమీక్షా సమావేశాలు నిర్వహించారు. రానున్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం నుండి నియోజకవర్గానికి రావాల్సిన వివిధ నిధులు, అభివృద్ధి పనుల సాధనకై కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ చీఫ్ ఇంజనీర్ ఎమ్. బాలు, ఎస్‌ఈ  ఫణి కుమారి, పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.