26 May, 2026 | 1:03 PM

Breaking News

సుల్తానాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యేదే   •   పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన   •   డంప్ యార్డ్ ఏర్పాటుకు ఒప్పుకోం..!   •   తాళం వేసిన ఇంట్లో చోరీ   •   మళ్లీ సీఎం కుర్చీ పంచాయతీ.. ఢిల్లీకి సిద్ధూ, డీకే.. పర్యటనపై ఉత్కంఠ   •   రోడ్డుప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి.. ఎస్పీ నితికా పంత్ నివాళి   •   ఇరాన్‌పై మరోసారి అమెరికా దాడులు   •   పాలమూరు ప్రాజెక్టు పూర్తికి.. అవాంతరాలు అధిగమిస్తాం: మంత్రి జూపల్లి   •   డ్రైవర్ నిద్రమత్తు.. పొలాల్లోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు బోల్తా   •   మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు   •  

గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కృషి

16-10-2025 12:00 AM

ఎమ్మెల్యే మురళి నాయక్ 

మహబూబాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ తెలిపారు. కేసముద్రం మండలంలోని వెంకటగిరి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే ఎమ్మెల్యే  చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధుల కింద గ్రామపంచాయతీ నూతన భవనానికి 20 లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు.

ఈ భవనాన్ని నాణ్యతతో నిర్మించి త్వరగా పూర్తయ్యే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గంట. సంజీవరెడ్డి, తహశీల్దార్ వివేక్, ఎంపీడీవో క్రాంతి, డిసిసి ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు, పీసీసీ సభ్యుడు గుగులోత్ దసురు నాయక్, సింగిల్ విండో మాజీ చైర్మన్ బండారు వెంకన్న, బండారు దయాకర్, మాజీ సర్పంచ్ మంగ సుజాత, మర్రి వెంకట్రావు, రాంపల్లి వెంకన్న, దుండి మధుకర్, లింగాల శ్రీనివాస్ రెడ్డి, మోహన్ రెడ్డి, గుగులోత్ శ్రీను,మల్లయ్య, అయిత సారయ్య, గాదె శ్రీనివాస్, కార్యదర్శి శైలజ పాల్గొన్నారు.