7 July, 2026 | 2:58 PM

Breaking News

సుద్దాలలో ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం, మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పత్రాలు అందజేత   •   ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు   •   పదవీ విరమణ సేవలకు మాత్రమే… వ్యక్తిత్వానికి కాదు   •   గోపాల్పేట్ గ్రామంలో నూతన సీసీ రోడ్డు పనులు ప్రారంభం   •   బీజేపీలో భారీ మార్పులకు రంగం సిద్ధం?   •   మరోసారి అవకాశం ఇస్తే.. మరింత అభివృద్ధి చేస్తాం   •   TRS పార్టీ పేరుపై ఢిల్లీ హైకోర్టుకు కవిత   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలే లక్ష్యం   •   మార్వాడీ యువ మంచ్ ఆధ్వర్యంలో ఉచిత ఫ్రీజర్ బాక్స్ ప్రారంభం   •  

ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి విశేష కృషి

18-11-2025 12:00 AM

 పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

మణుగూరు, నవంబర్ 17 (విజయ క్రాంతి) : ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృ ద్ధికి నిరంతరం కృషి చేస్తానని, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు.ఆదివారం డిగ్రీ కళాశాలలో 35 లక్షల రూ పాయల అంచనా వ్యయంతో నూత నం గా నిర్మించిన స్టాఫ్ రూమ్, కంప్యూటర్ రూమ్ లను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..తెలంగాణ విద్యారంగానికి దశాబ్దాలుగా పట్టిన గ్రహణం తొలగి పోయిందని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దార్శనికతతో ఇప్పుడు విద్యారంగంలో సరికొత్త కాంతు లు ప్రసరిస్తున్నాయన్నారు.

2008 లో నా టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి చొరవతో  ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేశారని తెలిపా రు. నాటి నుండి నేటి వరకు అంచలంచె లుగా కళాశాలను అభివృద్ధికి ఎమ్మెల్యే గా కృషి చేశానని,భవనాలను, వసతు లను, రోడ్డు, కళాశాల ప్రాంగణ ప్రహరీ గోడ వంటి పనులకోసం ప్రభుత్వంతో మాట్లాడి నిధులను సాధించామని తెలి పారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్, సింగరేణి ఇంచార్జ్ జిఎం డివి రామారావు, ఎస్ ఓ టు జి ఎం శ్రీనివాస చారి, డీజీఎం రమేష్, ఐటీడీఏ ఈఈ మధుకర్, తాహసిల్దార్ అద్దంకి నరేష్, ఎంపీఓ వెంకటేశ్వర రావు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు పీరినాకి నవీన్, టౌన్ అధ్యక్షులు శివ సైదులు, శివాలయం చైర్మన్ కూచిపూడి బాబు,మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కూరపాటి సౌజన్య పాల్గొన్నారు.