15 August, 2026 | 4:54 AM

భరోసా కేంద్రాన్ని సందర్శించిన ఎస్పీ శరత్ చంద్ర పవార్

15-08-2026 12:02 AM

నల్లగొండ క్రైం, ఆగస్టు 14 : మహిళలు, బాలికలు, చిన్నారులకు సమగ్ర సేవలు అం దించే భరోసా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ శుక్రవారం సందర్శించారు. బాధితులకు పోలీస్, వైద్య, న్యాయ సహా యం, కౌన్సెలింగ్ సేవలను పరిశీలించారు. భరోసా కేంద్రం సిబ్బందితో మాట్లాడిన ఎ స్పీ, బాధితుల పట్ల సానుభూతి, గోప్యతతో వ్యవహరించాలని సూచించారు.

బాలల కేసుల్లో చైల్ ఫ్రెండ్లీ విధానం పాటించాలని, సత్వర న్యాయం కోసం ఇతర శాఖలతో సమన్వయం చేయాలని ఆదేశించారు. ‘భరోసా కేంద్రం బాధితులకు అండగా నిలవా లి‘ అని అన్నారు. కార్యక్రమంలో సీఐ మం జుల, ఎస్‌ఐలు అమ్రీన్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.