9 May, 2026 | 10:23 AM

Breaking News

గర్భం దాల్చిన మైనర్ బాలిక... యువకుడిపై కేసు నమోదు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. మాజీమంత్రి గంగుల హౌస్ అరెస్ట్   •   తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్.. అధికారానికి అడుగు దూరంలో విజయ్!   •   నామకరణ మహోత్సవంలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్   •   ట్రిపుల్ ICG ఫ్లోరెసెన్స్ సాంకేతికతతో రోబోటిక్ ఈసోఫేజియల్ క్యాన్సర్ శస్త్రచికిత్సలో ప్రపంచస్థాయి ప్రమాణాన్ని నెలకొల్పిన హైదరాబాద్ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI)   •   రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయి   •   తమిళనాట తికమక!   •   భయం అవుట్ భరోసా ఇన్   •   రైతులకు మద్దతు ఏదీ?   •   ఇంటర్ విద్యకు మంగళం!   •  

తొలిసారి ఐసీసీ ట్రోఫీని ముద్దాడిన సౌతాఫ్రికా

14-06-2025 06:30 PM

లార్డ్స్: సౌతాఫ్రికా(South Africa) 27 సంవత్సరాల తర్వాత తొలిసారిగా ఐసీసీ ట్రోఫీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. టెంబా బవుమా(Temba Bavuma) సారథ్యంలో లార్డ్స్ వేదికగా జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్(World Test Championshipమ్యాచ్‌లో ఆస్ట్రేలియా(Australia)ను ఓడించిన సౌతాఫ్రికా.. వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌గా నిలిచింది. ఐడెన్ మార్క్రామ్ చిరస్మరణీయ సెంచరీ సాధించాడు. కెప్టెన్ టెంబా బావుమా గాయంతో పోరాడి మ్యాచ్‌లో మొత్తం 102 పరుగులు చేశాడు. 282 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా 4వ రోజున ఛేదించి, ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది. కగిసో రబాడా తన బౌలింగ్ తో అద్భుతంగా రాణించి, మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లు తీసుకున్నాడు. సౌతాఫ్రికా తరుఫున ఐసీసీ ఈవెంట్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా ఐడెన్ మార్క్రామ్ రికార్డ్‌ సాధించాడు. దీంతో  సౌతాఫ్రికా ఐసీసీ ట్రోఫీ కల నెరవేరింది.