5 March, 2026 | 10:52 AM

కేజీబీవీకి సౌండ్ సిస్టమ్ అందజేత

05-03-2026 12:00 AM

చేవెళ్ళ, మార్చి 4 (విజయక్రాంతి): చేవెళ్ల పట్టణ కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)కు భాజపా నాయకుడు అతెళ్లి మధుసూదన్ రెడ్డి  సాహితీ దంపతుల కుమారుడు అనిరుద్ రెడ్డి బర్త్డే వేడుకలు విద్యార్థుల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా  రూ.20 వేల విలువైన సౌండ్ సిస్టమ్ను విద్యాలయానికి అందజేశారు. విద్యా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు సౌండ్ సిస్టమ్ ఉపయోగపడుతుందని తెలిపారు. విద్యార్థినులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు.

పాఠశాల ప్రిన్సిపల్ శ్వేత రెడ్డి మాట్లాడుతూ.. పాఠశాల అవసరాలను గుర్తించి సహకారం అందించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. సమాజం నుంచి వస్తున్న మద్దతు ఎంతో ప్రోత్సాహకరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షుడు అతెల్లి అనంత్ రెడ్డి, నాయకులు శ్రీకాంత్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విద్యార్థినులు దాతలను అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.