వైటీపీఎస్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 38వ రోజు టీజీపీఈజేఏసీ నిరసన
గణపురం,(విజయక్రాంతి): కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ ప్రధాన గేటు వద్ద టీజీపీఈజేఏసీ ఆధ్వర్యంలో వైటీపీఎస్ ఏహెచ్‌పీ, సీహెచ్‌పీ ప్రైవేటీకరణ టెండర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, బుధవారం 38వ రోజు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రధాన గేటు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థల ప్రయోజనాలను కాపాడాలని, శాశ్వత ఉద్యోగుల హక్కులకు భంగం కలిగించే ప్రైవేటీకరణ చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, వైటీపీఎస్ ఏహెచ్‌పీ, సీహెచ్‌పీ ప్రైవేటీకరణ టెండర్‌ను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని కోరారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు టీజీపీఈజేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు మరింత ఉధృతంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.






