5 March, 2026 | 12:46 AM

శతాదిక వృద్ధురాలు 102 కొత్వాల్ పోచవ్వ గారికి ఘన సన్మానం

04-03-2026 08:11 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణానికి చెందిన శతాధికం పూర్తి చేసుకొని 102 సంవత్సరాల వయస్సులో యువతకు ప్రేరణగా రిటైర్డ్ ప్రొఫెసర్ డా. కోత్వాల్ తుకారాం గారి తల్లి కోత్వాల్ పోచవ్వ ఇటీవల మున్సిపల్ ఓటు హక్కు వినియోగించుకున్న కోత్వాల్ పోచవ్వకు ఆమె మనుమడు ఫైర్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ జమేధార్, బాన్సువాడ పట్టణ నాయిబ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు  కొండ విట్టల్  ఘన సన్మానం చేసినారు. ఇది బాన్స్వాడలో మేమందరం గర్వించదగ్గ విషయం అన్నారు. బాన్సువాడ పట్టణంలోని పెద్ద హనుమాన్ మందిర్ దగ్గర గతంలో పాత ఇంటిలో ఉండే కొత్వాల్ పోచవ్వ  లోకల్ దాయగా సుపరిచితులు. అప్పటికే ఆమె ప్రభుత్వ ట్రైన్డ్ దాయ.

అనేక ప్రసవాలు అతి కష్టమైనవి కూడ ఆమె ఇంటి దగ్గరనే విజయవంతంగా చేసి పలువురి మన్ననలు పొందిన ఘనత ఉంది. ఈ రోజుల్లో వృద్ధ తల్లి దండ్రులను సరిగ్గా పట్టించుకోని సందర్బంలో డా. కొత్వాల్ తుకారాం దంపతులు వారికి చేసే సేవల వల్లన్నే ఇంత కాలం సంతోషంగా ఆమె జీవిస్తున్నారని వారికి  పట్టణ ప్రజలు నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కొండ నారాయణ, గుండెకల్లూరు హన్మాండ్లు, గూడెంల శ్రీనివాస్, కొడగంటి ప్రభాకర్, సోనెవర్ సాయిలు, గొడ్డన్ల ప్రసాద్, కొంపల్లి శివ, కొంపల్లి కిరణ్, నాగారం శంకర్, శివాజీ, కొండ రాజేష్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.