హైదరాబాద్ ప్రజలకు చల్లని కబురు
05-05-2026 03:47 PM
హైదరాబాద్: ఉత్తర తెలంగాణలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. క్యూములోనింబస్ మేఘాల(Cumulonimbus clouds) వల్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఒక్క డిగ్రీ తగ్గాయి. రేపు, ఎల్లుండి ఉష్ణోగ్రతలు 2నుంచి 3 డిగ్రీలు తగ్గే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 8 నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ అధికారులు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచి భారీగా ఎండలు దంచుతున్నాయి. ఎండల ధాటికి హైదరాబాద్ నగర ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు.






