3 July, 2026 | 5:25 PM

Breaking News

కాంగ్రెస్ కు ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదు   •   కామ్రేడ్ అరుణోదయ నాగన్న మృతి ఉద్యమానికి తీరని లోటు   •   కేటీఆర్, హరీష్ లకు వార్తల్లో నిలవాలన్న తాపత్రయం.!   •   ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   యూరియా రైతులకు సరిపడా అందించాలి   •   తెలంగాణలో ఏపీ పోలీసుల చర్యలు ఖండనీయం   •   సింగరేణి ప్రధాన కార్యాలయంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట   •   37వ డివిజన్లో 77 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ   •   పసికందు కిడ్నాప్.. 72 గంటల్లో కేసును చేదించిన పోలీసులు   •  

దోమల సమస్య పరిష్కరించండి

14-04-2026 12:59 AM

ఉప్పల్, ఏప్రిల్ ౧౩ (విజయక్రాంతి): నాచారం డివిజన్లోని హెచ్‌ఎంటి నగర్ పెద్ద చెరువు, పటేల్ కుంట చెరువులలో పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలగించాలంటూ సోమవారం బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్ ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్తకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ  పనులు చేపట్టడానికి కోటి 20 లక్షల రూపాయల నిధులు కూడా మంజూరైనా పనులు చేపట్డం లేదన్నారు.  సుమారు రెండు నెలలు గడుస్తున్నా కానీ గుర్రపు డెక్క తొలగింపు పనులు ఇప్పటికీ చేపట్టలేదని దీంతో నాచారంలో దోమలు పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారుల అలసత్వం వల్లనే పనులు చేపట్టడం లేదని తక్షణమే గుర్రపు డెక్క తొలగింపు పనులు ప్రారంభించాలని  కమిషనర్  విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు.