సామాజిక న్యాయమే టీఆర్‌ఎస్ పార్టీ లక్ష్యం: రంజిత్ కుమార్
02-07-2026 12:06 AM
మల్దకల్, జూలై 1: మల్దకల్ మండల కేంద్రంలో తెలంగాణ రక్షణ సేన టిఆర్‌ఎస్ పార్టీ జెండా పండుగ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా ఇంచార్జి గొంగళ్ల రంజిత్ కుమార్ జెండాను బుధవారం ఆవిష్కరించారు. అంతకుముందు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, లక్ష్మీ తిమ్మప్ప స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సామాజిక న్యాయం, ప్రజా సమస్యల పరిష్కారమే పార్టీ లక్ష్యమని అన్నారు. విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయ రంగాల అభివృద్ధి కోసం పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






