28 April, 2026 | 5:16 PM

Breaking News

తుమ్మల నివాసంలో పూర్వ మిత్రుల కలయిక   •   అశ్వాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ మంజూరుపై ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు   •   దేవరకొండలో కళాశాల గోడపత్రిక ఆవిష్కరణ   •   దేవరకొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. నలుగురు కో-ఆప్షన్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక   •   బేగంపేట్‌లో మాజీ మంత్రి జీవన్ రెడ్డికి ఘన సన్మానం   •   నిలిచిపోయిన నీటి దారులు   •   బెంగాల్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్   •   సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ   •   గుగ్గిళ్ళ రమేష్ పై తగిన చర్యలు తీసుకోవాలి: ఉద్యోగుల జేఏసీ   •   పరీక్షల్లో అనుత్తీర్ణులు అయిన విద్యార్థులు నిరాశ చెందకూడదు   •  

కౌమార దశ బాలికలకు 'స్నేహ గ్రూప్' అవగాహన సదస్సు

28-04-2026 03:05 PM

ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 'స్నేహ గ్రూప్' యుక్త వయస్సు బాలికల కోసం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో కౌమార దశలో బాలికలు ఎదుర్కొనే సవాళ్లు, చట్టపరమైన రక్షణలు, ప్రభుత్వ పథకాలపై విస్తృత అవగాహన కల్పించారు. 

బాలికలు తమ హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలని, విద్యతోనే సామాజిక మార్పు సాధ్యమని వక్తలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు  మాట్లాడుతూ.. సమాజంలో ఇంకా వేళ్ళూనుకుపోయి ఉన్న బాల్య వివాహాల దురాచారం గురించి ఆందోళన వ్యక్తం చేశారు.