25 June, 2026 | 5:18 PM

నల్లమల అడవి నుంచి ఉడుముల అక్రమ రవాణా

25-06-2026 03:08 PM

వన్యప్రాణులతో సహా ఇద్దరినీ తదుపులోకి తీసుకున్న అటవీశాఖ అధికారులు 

అచ్చంపేట జూన్ 25: నల్లమల్ల అభయారణ్యం నుంచి అక్రమ మార్గంలో రెండు ఉడుములను తరలిస్తున్న వారిని అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మద్దిమడుగు అటవీ క్షేత్ర అధికారి చంద్రకాంత్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అమరాబాద్ పులుల అభయారణ్యం పరిధిలోని మద్దిమడుగు చెక్పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించారు. ఇద్దరు వ్యక్తులు తమ ద్విచక్ర వాహనంపై రెండు ఉడుములను తరలిస్తూ పట్టుబడ్డారు. నిందితులు పదర మండలం మారడుగు  చెందిన హరికుమార్, హనుమంతుగా గుర్తించినట్లు చెప్పారు. వారి నుంచి ఉడుములను స్వాధీనం చేసుకోగా ఒకటి మరణించిందని మరొకదాన్ని సంరక్షణ కోసం హైదరాబాదులోని జూ పార్కు తరలించామని తెలిపారు.