24 April, 2026 | 5:52 AM

విధినిర్వహణను సులభతరం చేసేందుకే స్మార్ట్ ఫోన్లు

24-04-2026 12:00 AM

ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు 

బూర్గంపాడు, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): అంగన్వాడీ టీచర్ల విధి నిర్వహణను సులభతరం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త స్మార్ట్ ఫోన్ ను అందజేస్తుందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు.గురువారం మండలంలోని సారపాక వాసవి ఫంక్షన్ హాల్ లో బూర్గంపాడు ఐసిడిఎస్ ప్రాజెక్టు సీడీపీఓ రేవతి అధ్యక్షతన జరిగిన అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో డిజిటల్ సాంకేతికత వినియోగం పెరిగి, పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలకు అందే సేవలు మరింత పారదర్శకంగా మారుతాయని పేర్కొన్నారు. 

మండలంలో ఉన్న 84 అంగన్వాడీ కేంద్రాల టీచర్లకు స్మార్ట్ ఫోన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జమలారెడ్డి, పంచాయతీరాజ్ టీ వెంకటేశ్వర్లు,విద్యుత్ శాఖ ఏఈ ఉపేందర్, మండల హౌసింగ్ శాఖ ఏఈ ఉదయ్ కిరణ్, టీపీసీసీ లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ భజన సతీష్,కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుగ్గెంపూడి కృష్ణారెడ్డి,జిల్లా మైనార్టీ సెల్ కన్వీనర్ మహమూద్ ఖాన్,స్థానిక సర్పంచ్ కిషోర్ శివరాం నాయక్, ఉపసర్పంచ్ కన్నెదారి రమేష్, సర్పంచులు మందా నాగరాజు, మంగమ్మ, పోతునూరి సూరమ్మ, మాజీ ఉపసర్పంచ్ పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, పంచాయతీ ఈవో మహేష్, ఇంగువ రమేష్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు ఎడమ కంటి సుధాకర్ రెడ్డి, భజన ప్రసాద్,అంగన్వాడీ సూపర్వైజర్లు, అంగన్వాడి టీచర్లు, బ్బంది తదితరులు పాల్గొన్నారు.