7 May, 2026 | 2:07 PM

Breaking News

కాంగ్రెస్ మండల కమిటీల అధ్యక్షుల నియామకం   •   కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •   మంత్రి జూపల్లి చేతికి బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి   •   ఐమాక్స్ లైట్లు ఏర్పాటుకు భూమి పూజ   •   ‘విజయ్ అనే నేను’.. సీఎం పీఠం ఖాయం?   •  

సీతా పయనం భావోద్వేగభరితం

08-02-2026 12:53 AM

యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో శ్రీరామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై రాబోతోన్న కొత్త చిత్రం ‘సీతా పయనం’. ఈ సినిమాతో అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా తెరకు పరిచయం కాబోతుండగా.. నిరంజన్, సత్యరాజ్, ప్రకాశ్‌రాజ్, కోవై సరళ ముఖ్యపాత్రల్ని పోషించారు. యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఓ ప్రత్యేకమైన పాత్రలో నటిస్తుండగా, అతని మేనల్లుడు ధ్రువ సర్జా ఓ కామియో రోల్‌లో కనిపించనున్నారు. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఫిబ్రవరి 14న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్ శనివారం విడుదలైంది. ట్రైలర్.. విజువల్స్, హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ ఇట్టే ఆకట్టుకునేలా ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్స్ ఈ చిత్రంలో మెయిన్ అస్సెట్‌గా నిలిచేట్టున్నాయి. మాస్ యాక్షన్, లవ్‌స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్.. ఇలా అన్నిరకాల అంశాల్ని ఈ ట్రైలర్‌లో జోడించారు. ఇది కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా ‘ఇల్లు అంటే గదులు కాదు.. బంధాలు’ అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి జీ బాలమురుగన్ సినిమాటోగ్రఫీ అందించారు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ రాయగా అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు.