మెదక్‌లో వైభవంగా సీతారాముల కల్యాణం
పాల్గొన్న మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మదేవేందర్ రెడ్డి దంపతులు..
మెదక్, మార్చి 27(విజయక్రాంతి): మెదక్ జిల్లా కేంద్రంలోని శ్రీ కోదండ రామాల యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తుల జయజయధ్వానాలు, వేదపం డితుల మంత్రోచ్ఛారణల నడుమ వైభవంగా జరిగింది. ఆలయ పూజారి ఆధ్వ ర్యంలో వేదపండితులు అభిజిత్ లగ్నంలో సంప్రదాయబద్ధంగా కళ్యాణ తంతును నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించి కళ్యాణంలో పాల్గొన్నారు.
ఉదయం 11:00 గంటలకు సీతారాములను పల్లకీలో తీసుకువచ్చి మం డపంలో ప్రతిష్టించి భక్తిశ్రద్ధలతో కళ్యాణం నిర్వహించారు. సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ తంతును భక్తులు ఆనందభరితంగా తిలకించారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ. మెదక్ జిల్లా ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముని ఆశీస్సులు రాష్ట్రంపై ఉండాలని ఆకాంక్షిస్తూ, ఆయన గుణగణాలను అందరూ అలవర్చుకోవాలని సూచించారు.
ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. ప్రభుత్వం పేద ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ళ. ఆంజనేయులు, కౌన్సిలర్లు మాయ గంగామణి మల్లేశం, కొట్టాల లలిత విశ్వం, పట్టణ పార్టీ కన్వీనర్ గడ్డమీద కృష్ణ గౌడ్, న్యాయవాది జీవన్ రావు, మాజీ కౌన్సిలర్లు ఆర్కే.శ్రీనివాస్, బిఆర్‌ఎస్ నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో ..
మెదక్, మార్చి 27(విజయక్రాంతి): మెదక్ పట్టణంలోని ద్వారకా నగర్లో శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో శుక్రవారం శ్రీరామనవమి పురస్కరించుకొని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మాజీ డిప్యూటీ స్పీకర్, బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎం. పద్మాదేవేందర్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ప్రభు రెడ్డి పద్మా దేవేందర్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ సంధ్య, నవీన్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మాజీ కౌన్సిలర్ సులోచన ప్రభు రెడ్డి, ఆరేళ్ల గాయత్రి ఆర్కే శ్రీనివాస్, బిఆర్‌ఎస్ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.




