మండల కేంద్రంలో ఐసిడిఎస్ భవన నిర్మాణానికి చర్యలు
05-08-2026 08:00 PM
బోథ్,(విజయక్రాంతి): మండల కేంద్రంలో ఐసిడిఎస్ భవన నిర్మాణానికి తక్షణమే నిధులు మంజూరు కి మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేయడం జరిగిందని ఎమ్మెల్యే జాదవ్ అనిల్ పేర్కొన్నారు. భవనం లేక ఐసిడిఎస్ కార్యాలయం ఇచ్చోడకు తరలిపోతుందని పలు పత్రికలలో వార్తలు రావడంతో స్పందించిన ఎమ్మెల్యే బుధవారం మంత్రి సీతక్కను మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ తో కలిసి కలవడం జరిగింది. దీంతో మంత్రి సీతక్క కార్యదర్శి సృజనతో చరవాణి లో మాట్లాడి అందుబాటులో ఉన్న నిధులు మంజూరు చేయాలని పేర్కొందని ఎమ్మెల్యే వివరించారు. భవన నిర్మాణం చేపడితే ఐసిడిఎస్ కార్యాలయం మండల కేంద్రంలో కొనసాగనుంది.






