5 August, 2026 | 9:17 PM

అంగన్ వాడీ కేంద్రాన్ని తరలించొద్దు

05-08-2026 08:08 PM

ఎల్బీనగర్: మహేశ్వరం నియోజకవర్గం డాక్టర్స్ కాలనీ డివిజన్ భగత్ సింగ్ నగర్ ఉన్న అంగన్ వాడీ కేంద్రాన్ని తరలించొద్దని స్థానికులు అధికారులను కోరారు. కాంగ్రెస్ పార్టీ డాక్టర్స్ కాలనీ డివిజన్ అధ్యక్షుడు నల్లెంకి ధన్ రాజ్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానికులు బుధవారం సీడీపీవో రేణుకను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ధన్ రాజ్ గౌడ్ మాట్లాడుతూ...  20 సంవత్సరాల నుంచి భగత్ సింగ్ నగర్ లో పేద పిల్లల కోసం అంగన్ వాడీ కేంద్రం కొనసాగుతోందన్నారు. ప్రస్తుతం 28 పిల్లలు చదువుకుంటున్నారని, వారి కోసం అంగన్ వాడీ కేంద్రాన్ని తరలించొద్దని కోరారు. ఉన్నతాధికారులతో మాట్లాడి  న్యాయం చేస్తామని సీడీపీవో రేణుక హామీ ఇచ్చారు.