12 May, 2026 | 3:14 AM

ఎమ్మెల్యే రాగమయి దయానంద్ సుడిగాలి పర్యటన

12-05-2026 12:44 AM

సత్తుపల్లి, మే 11 (విజయక్రాంతి): సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామంలో ఇందిరమ్మ లబ్ధిదారులు కేలావత్ రవీంద్ర, గౌరీ ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాగమయి దయానంద్, కాకర్లపల్లి గ్రామంలో ఆంబోజు నాగేశ్వరరావు, మమతా ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ వేడుక కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాగమయి దయానంద్ ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల నుండి అనూహ్య స్పందన.. సుమారు 15 సంవత్సరాల నిరీక్షణ నుండి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అందించిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలతో పేద ప్రజల ఇంట సంతోషాలు.. వారి మాటల్లో సంతోష బాగోద్వేగాలు. మాటల్లో చెప్పలేని వారి సంతోషం ఎమ్మెల్యే రాగమయితో పంచుకున్న ఇందిరమ్మ లబ్ధిదారులు. కాకర్లపల్లి గ్రామంలో మరికంటి శ్రీనివాసరావు, నాగలక్ష్మి  కుమార్తె  వధువు నిహారిక వివాహ వేడుక సందర్భంగా ఆశీర్వదించిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కి, రాష్ట్ర మంత్రివర్యులు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి కి,  తుమ్మల నాగేశ్వరరావు కి పేద ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన. ఎమ్మెల్యే రాగమయి దయానంద్   కాకరపల్లి గ్రామంలో పలు పరామర్శలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే. రాగమయి దయానంద్.