5 August, 2026 | 9:04 PM

ప్రాథమికోన్నత పాఠశాలకు టెలివిజన్ వితరణ

05-08-2026 08:12 PM

పాల్వంచ, (విజయక్రాంతి): పాల్వంచ మండలం దంతెలబోర ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం పాల్వంచ నవభారత్ కి  చెందిన కాంట్రాక్టర్ చెరుకూరి శేఖర్ బాబు బుధవారం స్మార్ట్ టీవీ ని వితరణ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లెంపాటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన  సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రాథమికోన్నత పాఠశాల దంతెలబోర సర్పంచ్ కొండ్రు ప్రసాద్  పాల్గొని మాట్లాడుతూ... మా పంచాయతీలోని పాఠశాలకు స్మార్ట్ టీవీ ని బహుకరించడం చాలా ఆనందంగా ఉందన్నారు.

పిల్లలు ఈ స్మార్ట్ టీవీ ద్వారా విద్యాసం బంధమైన అనేక విషయాలు తేలికగా నేర్చుకుంటారని, విద్యార్థులు   టీవీ పయోగించుకొని తమ విజ్ఞానాన్ని మెరుగుపరుచుకోవాలని కోరారు.  టీవీ ని వితరణ చేసిన చెరుకూరి శేఖర్ బాబు  పాల్గొని మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఈ స్థాయిలో ఉన్నానని, నాకు చేతనైన విధంగావిధంగా విద్యార్థులకు ఉపయోగపడాలని టీవీని బహుకరించినట్టు తెలిపారు .