సర్ సామాజిక బాధ్యతగా గుర్తించాలి
24-06-2026 01:45 AM
భైంసా జూన్ 23(విజయ క్రాంతి) భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న సర్ ఓటర్ జాబితా సామాజిక బాధ్య తగా గుర్తించాలని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. సోమవారం బాసర అమ్మవారి ఆలయంలో సర్ అవగాహన 2కే రన్ ప్రారంభించారు.
గోదావరి నది నుండి బాసర ఆలయం వరకు నిర్వహించిన ఈ రన్ లో సబ్ కలెక్టర్ సాంకేతి కుమార్ డిఆర్‌ఓ రమేష్ రాథోడ్ స్థానిక నాయకులు అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒక ఓటర్కు ఒకే ఓటు విధానం ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండ ల అధ్యక్షులు సాయినాథ్ పటేల్ రెవెన్యూ అధికారులు భక్తులు పాల్గొన్నారు






