24 June, 2026 | 2:45 AM

రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి

24-06-2026 01:45 AM

కలెక్టర్ కె. హైమావతి 

సిద్దిపేట కలెక్టరేట్, జూన్ 23: సిద్దిపేట జిల్లాలో ఎల్నీనో ప్రభావం ప్రారంభమైన నేపథ్యంలో నీటి వనరులు ఉన్న రైతులు సన్నవడ్లు సాగు చేయాలని, వర్షాభావ ప్రాంతాల్లో పప్పుధాన్యాలు, నూనెగింజలు, మిల్లెట్స్, కూరగాయల వంటి ప్రత్యామ్నాయ పంటలు పండించాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి సూచించారు. మంగళవారం సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల రైతువేదికలో నిర్వహించిన విత్తన మేళాలో కలెక్టర్ పాల్గొన్నారు. జూన్ 23 నుంచి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా రైతువేదికల ద్వారా సబ్సిడీపై నాణ్యమైన విత్తనాల పంపిణీ చేపడుతున్నట్లు తెలిపారు.

ఎల్నీనో కారణంగా వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రైతులు అందుబాటులో ఉన్న నీటి వనరులు, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపిక చేసుకోవాలని సూచించారు. అనంతరం రైతు చిన్ని శ్రీనివాస్రెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన కలెక్టర్, రసాయనాలు లేకుండా సాగుచేస్తున్న అరటి, బొప్పాయి, కోకో, మునగ తోటలను పరిశీలించి రైతును అభినందించారు. కార్యక్రమంలో డీఏఓ స్వరూపరాణి, ఏఈఓ మీరా, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.