23 July, 2026 | 1:25 AM

సర్కిల్, వార్డు కార్యాలయాల్లో ‘సర్’ హెల్ప్‌డెస్క్‌లు

23-07-2026 12:00 AM

ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహాతో 

ఎల్బీనగర్, జూలై 22 : ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్)లో ఓటర్లకు సహాయకారిగా ఉండడానికి  ప్రత్యేక సహాయం కేం ద్రాలు (హెల్ప్ డెస్క్) ఏర్పాటు చేస్తున్నట్లు జోనల్ కమిషనర్ వికాస్ మహాతో తెలిపారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎల్బీనగర్ జోనల్ లోని ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం(49) పరిధిలో ఉన్న మున్సిపల్ సర్కిల్, వార్డు కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేశారు. నాగోల్ వార్డు కార్యాలయం, సరూర్నగర్ సర్కిల్ కార్యాలయం,

ఎల్బీనగర్ సర్కిల్ కార్యాలయం, హయత్ నగర్ సర్కిల్ కార్యాలయంతోపా టు ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ కార్యాలయంలో ఓటరు సహాయక కేంద్రాలను ఏ ర్పాటు చేసినట్లు కమిషనర్ వికాస్ మహాతో పేర్కొన్నారు. ఎన్యూమరేషన్ (వివరాల సేకరణ) ఫారం పొందని వారు, తమ బూత్ స్థాయి అధికారి (బీఎల్వో) వివరాలు తెలియనివారు లేదా ఫారం నింపడం, సమర్పిం చడంలో సహాయం అవసరమైనవారు పైన పేర్కొన్న ఏ సహాయ కేంద్రానికైనా వెళ్ళవచ్చని తెలిపారు. అర్హులైన ఓటర్లందరూ సహాయ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని, తమ ఓటరు వివరాలను అప్డేట్ చే సుకోవడానికి, తమ ఓటు హక్కును కాపాడుకోవడానికి ఎన్యూమరేషన్ ఫారాలను వీలైనంత త్వరగా సమర్పించాలని కోరారు.