విజయవంతంగా కొనసాగుతున్న ‘సర్’
కాంగ్రెస్ నాయకుడు సాయిపేట శ్రీనివాస్
మేడ్చల్ అర్బన్, జూన్ 29(విజయక్రాంతి):సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ లోని గుండ్లపోచంపల్లి లో డాక్టర్ అంబేద్కర్,బాబు జగ్జీవన్ రామ్ కాలనీలో ఇమ్యూనేషన్ ఫారం లను బిఎల్‌ఓ లతో కలిసి ఇంటింటికి తిరిగి ఓటర్లకు ఫారం లను 299 వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజి కౌన్సిలర్ సాయిపేట శ్రీనివాస్ అందజేసినట్లు డివిజన్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కుండ భానుచందర్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ 299 వ డివిజన్ పరిధిలో గల ప్రజలకు సర్ ప్రక్రియ గురించి వివరిస్తూ అవగాహన కల్పించడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు.అంతే కాకుండా సర్ ఫారం నింపిన తర్వాత బిఎల్‌ఓ లకు అందించాలని సాయిపేట శ్రీనివాస్ వెల్లడించారు.ఈ కార్యక్రమంలో గుండ్లపోచంపల్లి గ్రామ మాజి సర్పంచ్ బండారి నరేందర్ ముదిరాజ్.బుర్కగాళ్ల శ్రీనివాస్.బిఎల్‌ఓ కిరణ్.ఎక్కడిగాళ్ల కృష్ణ.కొమ్ము కృష్ణ స్థానిక ప్రజలు పాల్గొన్నారు...






