సింగ్ గీతం ఈతరానికి మంచి గిఫ్ట్
12-06-2026 12:46 AM
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘సింగ్ గీతం’ జూన్ 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ గురువారం ప్రెస్‌మీట్ నిర్వహిచారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. “సింగీతం సార్ 14 ఏళ్ల తర్వాత మళ్లీ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘సింగ్ గీతం’. ఇలాంటి సినిమా ఇప్పటివరకు వరల్ సినిమాలో రాలేదు. ఆయన స్టైల్లో చేసిన మరో సరికొత్త ప్రయోగం. ఈతరం ప్రేక్షకులకు ఈ సినిమా ఒక మంచి గిఫ్ట్. ఈ సినిమా చూసి మరో 10 ఏళ్ల కుర్రాడు కూడా స్ఫూర్తి పొందాలనేదే మా ఆశ” అన్నారు.






