12 June, 2026 | 3:10 AM

అన్ని అంశాలతో థాంక్యూ సుబ్బారావు

12-06-2026 12:45 AM

చందు ముద్దు దర్శకత్వంలో రానున్న మరో కొత్త సినిమా ‘థాంక్యూ సుబ్బారావు. కుర్ర పొడక్షన్స్ బ్యానర్‌పై దినేశ్ కుర్ర నిర్మిస్తున్న ఈ సినిమా లో చంద్రహాస్ కోట్ల, లావణ్య సాహుకార, రోహిత్‌రెడ్డి యర్రంరెడ్డి, మురళీధర్‌గౌడ్ ముఖ్యపాత్రల్ని పోషించారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్‌లుక్‌ను, టీజర్‌ను రిలీజ్ చేశారు. టీజర్‌ను గమనిస్తే.. కామెడీ, యాక్షన్, లవ్, సస్పెన్స్, థ్రిల్.. ఇలా అన్ని అంశాల్ని జోడించి ఈ సినిమాను తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: ప్రిన్స్ హెన్రీ; డీవోపీ: పంకజ్ తొట్టాడ; ఎడిటర్: డీ వెంకట ప్రభు.