తెలంగాణ గుండెచప్పుడు సింగరేణి..
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సత్తుపల్లి జూలై23( విజయ క్రాంతి ): పోటీ ప్రపంచంలో సింగరేణి క్యాలరీస్ సం స్థను సమర్థవంతంగా నిర్వహిస్తూ, వ్యాపార విస్తరణ ద్వారా భవిష్యత్ తరాలకు సురక్షితంగా అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సింగరేణి తెలంగాణకు ఆత్మలాంటిది.. కార్మికులు, ప్ర జలతో 130 ఏళ్ల చరిత్రకలిగిన సింగరేణితో భావోద్వేగ అనుబంధం ఉందని డిప్యూటీ సీఎం అన్నారు.
ఈ ప్రభుత్వ రంగ సంస్థను కాపాడుకోవడమే కాకుండా, రాబోయే తరాలకు లాభదాయకంగా అందించడం మన అందరి బాధ్యత అని ఆయన అన్నారు. గు రువారం సత్తుపల్లిలోని సింగరేణి ఒపెన్ కాస్ట్ బొగ్గుగనిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశీలించారు. గనిలో బొగ్గు లభ్యత, పరిమాణం, బొగ్గు క్వాలటీని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడా రు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుతో పాటుగా ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ నవీన్ మిట్టల్, సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ధ ప్రకాష్, జెన్ కో సీఎండీ హరీష్, సింగరేణి డైరెక్టర్ గౌతమ్ పోట్రూ, ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, సత్తుపల్లి, వైరా ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, మాలోత్ రాందాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మీడియాతో మాట్లాడుతూ మైనింగ్ నిర్వహణలో పాటిస్తున్న పద్ధతులు, ఎదురవుతున్న సవాళ్లు, భవిష్యత్తు ప్రణాళికలను ప్రత్యక్షంగా చూడటానికే క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చినట్లు తెలిపారు. ఓవర్ బర్డెన్ అనేది మైనింగ్ లో బయటకు తీసే మట్టి, రాతి వ్యర్థం.
బొగ్గు అనేది సింగరేణికి ప్రధాన రాబడి తెచ్చే అత్యంత విలువైన వనరుగా ఆయన అన్నారు. కాంట్రాక్టర్లకు ఓబి తీసినా, బొగ్గు తీసినా వాల్యూమ్ ప్రకారమే బిల్లులు వస్తాయి కాబట్టి వారి దృష్టిలో రెం డూ ఒక్కటే అనిపించవచ్చని, సింగరేణి యా జమాన్యానికి మాత్రం ఓవర్ బర్డెన్, బొగ్గు మధ్య ఉన్న వ్యత్యాసం చాలా స్పష్టంగా తెలిసి ఉండాలన్నారు. ఫేస్ వద్ద బ్లాస్టింగ్ జరిపి, లోడింగ్ చేసే సమయంలో బొగ్గులో ఓవర్ బర్డెన్ మట్టి, రాళ్ళు కలవకుండా చూడాలన్నారు.
ప్రతీ షావల్ దగ్గర, ప్రతీ లోడింగ్ పాయింట్ దగ్గర మన అధికారులు ఉండి కంటిన్యూయస్ మానిటరింగ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాగ మయి దయానంద్,రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ నాగేశ్వరరావు, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ సత్యనారాయణ, సుడా చైర్మన్ దుర్గాప్రసాద్, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, సింగరేణి డైరెక్టర్లు సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు, తిరుమల రావు, మున్సిపల్ చైర్ పర్సన్ రెహానా కమల్, వైస్ చైర్పర్సన్ సుమలత, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.






