24 July, 2026 | 1:12 AM

ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి

24-07-2026 12:05 AM

జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

సూర్యాపేట, జూలై 23 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో జాతీయ రహదారి 65 (ఎన్ హెచ్ 65)కి సంబంధించి జరుగుతున్న రోడ్డు విస్తరణ, ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను వారి దగ్గర పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్ అన్నారు. గురువారం జిల్లా ఎస్పీ నరసింహతో కలసి జాతీయ రాతిరి పనులను అని పరిశీలించారు.

ఈ సందర్భంగా జాతీయ రహదారుల అథారిటీ అధికారులను పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారి విస్తరణ పనులను నిర్దేశిత గడువులోగా, అత్యంత వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన, సౌకర్యవంతమైన రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

తదుపరి జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ.. నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రమాదాల నివారణకు అవసరమైన చోట్ల సైన్ బోర్డులు, రక్షణ కంచెలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాతీయ రహదారుల అథారిటీ అధికారులు, పోలీస్ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.