12 August, 2026 | 7:52 PM

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సింగరేణి సన్నాహాలు

12-08-2026 06:09 PM

ఇల్లెందు,(విజయక్రాంతి): 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సింగరేణి ఇల్లందు ఏరియా యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. దేశభక్తిని ప్రతిబింబించేలా వేడుకలను నిర్వహించాలని సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు వి. రమ కృష్ణయ్య సూచించారు. ఇల్లందు ఏరియా జనరల్‌ మేనేజర్‌ కార్యాలయంతో పాటు సింగరేణి సెంట్రల్‌ ఫంక్షన్‌ను జీకే సీఈఆర్‌ క్లబ్‌లో నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు.

వేడుకల్లో సింగరేణి హైస్కూల్‌ విద్యార్థులు, సేవా సమితి సభ్యులు, ట్రైనర్లు పాల్గొని దేశభక్తిని చాటే సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించాలని కోరారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో సీనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌ జి. సుధాకర్‌, సింగరేణి పాఠశాల ఉపాధ్యాయురాలు ధనలక్ష్మి, సేవా సమితి కార్యదర్శి సులక్షణ, సభ్యులు, ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు.