విశ్వశాంతి స్కూల్‌లో ఆరోగ్య అవగాహన కార్యక్రమం
సత్తుపల్లి,(విజయక్రాంతి): న్యూ స్టార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, న్యూ స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య బృందం మరియు విశ్వశాంతి స్కూల్ యాజమాన్యం సహకారంతో విద్యార్థులకు ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ సురేష్ రామాల పిల్లలకు జ్వరం, జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిశుభ్రత, పోషకాహారం, మంచి నిద్ర గురించి వివరించారు.
డాక్టర్ ముద్దిశెట్టి ఉమేష్ చెవి, ముక్కు, గొంతు ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. డాక్టర్ భీమిరెడ్డి లహరి 8, 9, 10వ తరగతి బాలికలకు వ్యక్తిగత పరిశుభ్రత, యుక్తవయస్సులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు అందించారు. అలాగే విద్యార్థులు తల్లిదండ్రులను, గురువులను గౌరవిస్తూ మంచి క్రమశిక్షణతో, ఆరోగ్యకరమైన అలవాట్లతో, మంచి లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు.
“మంచి ఆరోగ్యం.మంచి విద్య – మంచి సంస్కారం… ఇవే ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన న్యూ స్టార్ ఫౌండేషన్, న్యూ స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య బృందానికి మరియు విశ్వశాంతి స్కూల్ యాజమాన్యానికి అభినందనలు.






