కాంగ్రెస్ పార్టీలో చేరిన సింగారైపేట్ సర్పంచ్
ఉట్నూర్, మే 29( విజయక్రాంతి): ఉట్నూర్ మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన జన్నారం మండలం సింగారైపేట్ సర్పంచ్ తొడసం రజిత రాంపాల్, బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం ఉదయం ఉట్నూరులో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అధికార పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ ఫలాలు గుర్తించి వాటిలో చేరుతున్నామని ప్రకటించారు.ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు నియోజకవర్గాన్ని చేస్తున్న అబివృద్దికి ఆకర్షితులై కాంగ్రెస్ లో చేరుతున్నాం అని సర్పంచ్ అన్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ,ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పతకాలను ప్రజలకు తెలియజేయాలని ఎమ్మెల్యే సూచించారు.ఈ కార్యక్రమంలో జన్నారం మండల కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.






