18 July, 2026 | 4:19 PM

Breaking News

గడ్డన్న సుద్ద వాగు ప్రాజెక్టు సందర్శించిన కలెక్టర్   •   ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు మెరుగుపరచాలి   •   జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల్లో సర్వజ్ఞ స్కూల్ విద్యార్థికి కాంస్య పతకం   •   ప్రియదర్శిని మహిళా ఇంజినీరింగ్ ఆటోనామౌస్ కళాశాలలో యువ నాయకత్వం   •   విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి   •   డీటిబ్ల్యూఓ జాదవ్ అంబాజీకి సన్మానం   •   సోనం వాంగ్చుక్ దీక్షకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మద్దతు   •   చెట్టును ఢీకొన్న బైక్.. యువకుడు మృతి   •   రామగుండం కమీషనరేట్ లో కోర్టు డ్యూటీ అధికారుల పనితీరు మెరుగుపర్చాలి   •   పట్టణాభివృద్ధికి ప్యాకేజీ ప్రకటించాలి   •  

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం

29-05-2026 10:25 AM

మానకొండూరు, మే 29 ,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం శ్రీనివాస్ నగర్ గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పెంకుటిల్లు అగ్నికి ఆహుతయింది. ఇంటి యజమాని పొన్నాల చంద్రయ్య ఉపాధి హామీ పనులకు వెళ్ళగా, ఇంట్లో ఎవరూలేని సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 6 క్వింటాళ్ల బియ్యం బట్టలు, ఇంటిలోని వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. రజక కులానికి చెందిన చంద్రయ్య కులవృత్తి, కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడని, ప్రభుత్వం నష్టాన్ని అంచనా వేసి, ఆర్థిక సహాయం అందించి, ఈ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని శ్రీనివాస్ నగర్ సర్పంచ్ ఎరుకల శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు.