13 May, 2026 | 11:15 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

సిద్దు జొన్నలగడ్డకు శోభన్‌బాబు అవార్డు

15-01-2026 01:46 AM

తనదైన అందం, అభినయంతో ప్రేక్షకాభిమానుల్లో చెరగని ముద్ర వేసిన నటభూషణ శోభన్‌బాబు. అఖిల భారత శోభన్‌బాబు సేవా సమితి పేరిట ఆయన అభిమానులు వివిధ సేవా కార్యక్రమాలను చేపడుతూ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఇటీవల సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి ‘సోగ్గాడు’ సినిమా స్వర్ణోత్సవాలను నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా బుధవారం శోభన్‌బాబు జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రజ్ఞా పాటవాలను ప్రదర్శించిన యువ హీరో ఒకరికి ఈ ఏడాది నుంచి ‘సోగ్గాడు శోభన్‌బాబు అవార్డు’ పేరిట పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు అఖిల భారత శోభన్‌బాబు సేవా సమితి అధ్యక్షుడు సుధాకర్‌బాబు ప్రకటించారు. ఈ ఏడాది ఈ అవార్డుకు యువ హీరో సిద్దు జొన్నలగడ్డను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. త్వరలో ఏర్పాటు చేయబోయే ప్రత్యేక వేడుకలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్టు తెలిపారు.