తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన రూరల్ పోలీసులు
సిద్దిపేట రూరల్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరవీరులు చేసిన త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని సిద్దిపేట రూరల్ ఎస్సై రాజేష్ పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అమరవీరులకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యమకారుల త్యాగాలు, ప్రజల ఆకాంక్షలు మరియు దీర్ఘకాల పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సాకారమైందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. అనంతరం పోలీసు సిబ్బందికి తెలంగాణ ఆవిర్భావ చరిత్ర, ప్రాధాన్యతను వివరించి, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అంకితభావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొని తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.






