29 May, 2026 | 8:31 PM

ఢిల్లీకి చేరిన కర్నాటక రాజకీయం

29-05-2026 10:06 AM

న్యూఢిల్లీ: కర్నాటక రాజకీయం ఢిల్లీకి చేరింది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత సిద్ధరామయ్య(Siddaramaiah) ఢిల్లీకి వెళ్లారు. సిద్ధరామయ్యతో పాటు తొమ్మిది మంది నాయకులు ఢిల్లీకి చేరుకున్నారు. తన వర్గంతో డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్తున్నారు. సోనియా గాంధీ(Sonia Gandhi), మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో(Rahul Gandhi) సిద్దరామయ్య భేటీ ప్రారంభం అయింది. కాసేపట్లో డీకే శివకుమార్ భేటీకి హాజరుకానున్నారు. సిద్దరామయ్య రాజీనామా తర్వాత కర్ణాటక తదుపరి ప్రభుత్వం ఏర్పాటు, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, నాయకత్వ మార్పుపై తీవ్ర చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. రాజ్యసభ స్థానాన్ని ఇప్పటికే తిరస్కరించిన సిద్ధరామయ్య, కాంగ్రెస్ అధిష్టానంతో(Congress High Command) తన భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నందున, ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.