షాద్ నగర్ లో ఘనంగా శ్రీ రామ శోభయాత్ర ప్రారంభం
శోభాయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
శోభయాత్రకు హాజరైన బిజెపి ఆర్ఎస్ఎస్ విశ్వహిందూ పరిషత్ హిందూ వాహిని నాయకులు
షాద్‌నగర్,(విజయక్రాంతి): శ్రీరామ నవమి సందర్భంగా హిందూ వాహిని ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే శ్రీరామ శోభాయాత్రను స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, విశ్వహిందూ పరిషత్ నాయకులు బండారు రమేష్, అందే బాబయ్య, విష్ణువర్ధన్ రెడ్డి, చట్ల వెంకటేష్,మున్సిపల్ చైర్మన్ అగనూర్ బసవేశ్వర్, వాయిస్ చైర్మన్ అందే మోహన్ హిందూ వాహిని అధ్యక్షుడు రాఘవేందర్, బిజెపి ఆర్ఎస్ఎస్ విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ తదితరులు పాల్గొన్నారు. ఈ శోభాయాత్రలో వేలాది మంది కార్యకర్తలు, శ్రీరామ భక్తులు ఉత్సాహంగా పాల్గొని భక్తి భావాన్ని చాటారు. కార్యక్రమం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా కొనసాగింది.




