27 March, 2026 | 11:21 PM

అంగరంగ వైభవంగా శ్రీ సీతారాములోరి కళ్యాణోత్సవం

27-03-2026 08:52 PM

పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే

ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ

తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలోని పెద్దేముల్, యాలాల, బషీరాబాద్, తాండూర్ మండలాల్లోని గ్రామాలతో పాటు తాండూర్ మున్సిపల్ పరిధిలో శుక్రవారం శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగాయి. జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన జుంటుపల్లి శ్రీ సీతారామాంజనేయ దేవాలయంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారి కల్యాణోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రాములోరికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి సైతం పాల్గొని ప్రత్యేక పూజలు. గ్రామాల్లోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాలు శ్రీ రామ మందిరాల్లో కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. సాయిపూర్ లో మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్రెడ్డి దంపతులు, పెద్దెముల్ శ్రీ హనుమాన్ మందిరంలో అల్లంకల రవి, రుక్మిణి దంపతులు కళ్యాణోత్సవం నిర్వహించారు. పెద్దముల్ లో చిన్నారులు శ్రీ సీత రామ లక్ష్మణ ఆంజనేయ వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం భక్తులకు భారీగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.