సీఈఆర్ క్లబ్‌లో తాగునీరు సౌకర్యాలు కల్పించాలి
మణుగూరు,(విజయక్రాంతి): పీవీ కాలనీ భద్రాద్రి స్టేడియం ప్రాంగణంలో సింగరేణి కార్మికులతోపాటు వారి కుటుంబ సభ్యుల సంక్షేమం, వినోదం, ఐక్యత పెంపుదల కోసం ఏర్పాటు చేసిన సి ఈ అర్ క్లబ్ కు మెరుగైన సౌకర్యాలు కల్పిం చాలని ఏరియా టీబీజీకేఎస్ అధ్యక్షులు నాగేల్లి వెంకట్ సింగరేణి యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఏరియా ఎస్ఓటు జిఎంకు వినతి పత్రాన్ని అందించారు.
అనంతరం మాట్లాడుతూ... గడిచిన ఆరు నెలల నుండి క్లబ్ ప్రాంగణంలో తాగునీటి సరఫరా లేకపోవడంతో క్లబ్ సేవలకు వచ్చే వారు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని క్లబ్ లో తాగునీటి కోసం ఫ్రిజ్ లు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ఉదయం సాయంత్రం వాకింగ్ కి వచ్చే సభ్యుల కోసం స్టేడియంలో మెరుగైన లైటింగ్ ను ఏర్పాటు చేసి,మౌళిక వసతు లను మెరుగుపరచాలని ఆయన అధికారులకు విజ్ఞప్తి చేశారు.




