27 March, 2026 | 11:33 PM

కర్మన్ ఘాట్ లో ప్యూర్ ఈవీ ప్రారంభం

27-03-2026 09:40 PM

హైదరాబాద్, 27 మార్చి 2026 ఃతెలంగాణ రాష్ట్రంలోని వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్ కేంద్రంలో దిగ్గజ కంపెనీలన్నీ తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నాయి. దీనిలో భాగంగా  తన భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల రంగంలో ముందంజలో ఉన్న ప్యూర్ ఈవీ సంస్థ హైదరాబాద్‌ కర్మన్ ఘాట్ లో తన అత్యాధునిక షోరూమ్‌ను ఘనంగా ప్రారంభించింది. ప్రాంతీయ విస్తరణలో భాగంగా, కంపెనీ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక డిస్ట్రిబ్యూటర్‌ను నియమించింది.

ఈ బాధ్యతలను ప్రొప్రైటర్ శ్రీ పోల సత్యకుమార్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ కొత్త షోరూమ్ సంస్థ యొక్క వేగవంతమైన రిటైల్ విస్తరణలో కీలక మైలురాయిగా నిలుస్తుంది. ఈ షోరూమ్ కేవలం విక్రయ కేంద్రం మాత్రమే కాకుండా ఇది దక్షిణ భారతదేశంలో స్థిరమైన మొబిలిటీని అందరికీ చేరవేయాలనే కంపెనీ లక్ష్యానికి కేంద్రబిందువుగా పనిచేస్తుంది. నగరంలో గ్రీన్ ఎనర్జీ వైపు వేగంగా మార్పు చోటుచేసుకుంటున్న ఈ సమయంలో షోరూమ్ ప్రారంభించడం సంతోషంగా ఉందని ప్యూర్ ఈవీ సంస్థ తెలిపింది.

వినియోగదారులు కోరుకునే అత్యుత్తమ రేంజ్, సామర్థ్యానికి ప్రసిద్ధి చెందిన సరికొత్త మోడల్స్ అందుబాటులో ఉంచినట్టు వెల్లడించింది. ప్యూర్ ఈవీ వచ్చే 30 నెలల్లో 250 కొత్త డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేసి, మొత్తం నెట్‌వర్క్‌ను 320 కంటే ఎక్కువ అవుట్‌లెట్లకు విస్తరించాలనే లక్ష్యంగా పెట్టుకుంది. స్వదేశీ పరిశోధన , స్థానిక తయారీపై దృష్టి సారిస్తూ, బ్రాండ్ దీర్ఘ శ్రేణి ఎలక్ట్రిక్ పరిష్కారాలపై పెరుగుతున్న సంస్థాగత డిమాండ్‌కు అనుగుణంగా పనిచేస్తున్నట్టు ప్యూర్ ఈవీ వెల్లడించింది.