27 March, 2026 | 11:17 PM

ఘనంగా శివంపేటలో సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుక

27-03-2026 09:02 PM

ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పించిన సర్పంచ్ వెంకటేశ్వర్ పద్మ దంపతులు

వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు ఏర్పాటు

శివంపేట,(విజయక్రాంతి): శివంపేట మండల కేంద్రంలోని ప్రసిద్ధి పురాతన దేవాలయమైన శ్రీ కోదండ రామస్వామి దేవాలయం. కోదండ రామస్వామి దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల మధ్య రంగురంగుల పుష్పాలతో అలంకరించిన కళ్యాణ మండపంపై అభిజిత్ లగ్నంలో కల్యాణ వేడుక ప్రారంభించారు. వేద పండితులు శాస్త్రుల పురుషోత్తమ శర్మ, వామన శర్మ రాఘవేంద్ర శర్మ, శ్యామ్ సుందర్ శర్మ, కోదండరామస్వామి దేవాలయ పూజారి చందు ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.

సుమారుగా 1500 మందికి భక్తుల సౌకర్యార్థం స్థానిక గ్రామ సర్పంచ్ రాజిపేట వెంకటేశ్వర్, మరియు ఉప సర్పంచ్ ఇసు గారి మల్లేశం గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు మరియు శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవ కమిటీ సభ్యులు సౌకర్యార్థం ఏర్పాటు చేశారు. కళ్యాణ మహోత్సవ వేడుకకు వచ్చిన భక్తులకు చలువ పందిరి మంచినీటి సౌకర్యం తీర్థ ప్రసాదాలు ఏర్పాటు చేశారు.