గోదావరి నదిలో మునిగిపోతున్న వ్యక్తిని కాపాడిన డిడిఆర్ఎఫ్ బృందం
భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా గోదావరి వద్ద స్నానానికి వెళ్లిన హైదరాబాద్ కి చెందిన ఉదయ్ అనే యువకుడు ప్రమాదవశాత్తు గోదావరి నదిలో పడ్డాడు.ఆ సమయంలో అక్కడే విధులలో ఉన్న డీడిఆర్ఎఫ్ సిబ్బంది, స్థానిక ఈతగాళ్లు వెంటనే స్పందించి బాదితుడిని రక్షించి ఆంబులెన్స్ లో హాస్పటల్ కి తరలించారు.
ఆపదలో ఉన్న వారిని సంరక్షించడానికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పోలీస్ శాఖ తరపున ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DDRF) బృందం ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడటంతో అక్కడే ఉన్న స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడిన DDRF బృంద సభ్యులైన ఆరెఎస్సై సుమంత్, కానిస్టేబుళ్ళు రమేష్,వినోద్ కుమార్,రాజేష్,ఫరీద్ బాబు,జమలయ్య,సాయి ఫణింద్ర,అనిల్ కుమార్ లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.




